- by John Doe
ఆదోనిలో దారుణం: పెట్రోల్ పోసి మహిళకు నిప్పు.!
కర్నూలు జిల్లా: ఆదోని ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో మున్సిపల్ ఉద్యోగిని నరసమ్మపై మహిళల బృందం దాడి చేసింది. దాడి చేసిన వారు మొదట ఆమె కళ్లలో కారం చల్లి, ఆ తర్వాత ఆమెపై పెట్రోల్ పోసి నిప్పు అంటించినట్లు సమాచారం. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన నరసమ్మ ప్రస్తుతం ఆసుపత్రిలో ప్రాణాలతో పోరాడుతూ చికిత్స పొందుతోంది.
నరసమ్మ తన ఇద్దరు పిల్లలను పోషించుకుంటున్న వితంతువు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
0 Comments:
No comments yet. Be the first to comment!
Leave a Reply