శింగనమల అభివృద్ధిపై సీఎం చంద్రబాబుకు ఎమ్మెల్యే వినతి

AP: శింగనమల నియోజకవర్గంలోని ఎస్సీ వర్గాల అభివృద్ధి, విద్య, ఉపాధి, మౌలిక వసతుల కల్పనకు సంబంధించి ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని కలిసి పలు వినతిపత్రాలు అందజేశారు.

రాచెపల్లి LIDCAP లెదర్ పార్క్‌ను పునరుద్ధరించి 3,000 కుటుంబాలకు ఉపాధి కల్పించాలని కోరారు. పుట్లూరులో నిరుపయోగంగా ఉన్న జూనియర్ కాలేజ్ భవనాన్ని 200 మంది విద్యార్థుల సామర్థ్యంతో ఎస్సీ బాలుర హాస్టల్‌గా మార్చి మౌలిక వసతులు కల్పించాలని విజ్ఞప్తి చేశారు.

అలాగే శింగనమల, బుక్కరాయసముద్రంలో అంబేద్కర్ భవనాల ఏర్పాటుకు నిధులు మంజూరు చేయాలని కోరారు. వినతులపై సీఎం సానుకూలంగా స్పందించి, ప్రతిపాదనలను పరిశీలించి అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు ఎమ్మెల్యే తెలిపారు.

author

Rrrr

Author of this article

0 Comments:

No comments yet. Be the first to comment!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

YOU MAY ALSO LIKE