- by Rrrr
తిరుమలలో భక్తుల రద్దీ.. సర్వదర్శనానికి 24 గంటలు
-
- by Rrrr
- in Devotional
- 0 likes
తిరుమల లో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని కంపార్ట్‌మెంట్లు పూర్తిగా నిండిపోవడంతో, భక్తులు బయట ఉన్న క్యూ లైన్లలో వేచి ఉన్నారు. టోకెన్లు లేని భక్తులకు స్వామివారి సర్వదర్శనం లభించడానికి సుమారు 24 గంటల సమయం పడుతోంది.
నిన్న 84,176 మంది భక్తులు ఆలయాన్ని సందర్శించగా, 36,673 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. హుండీ కానుకల రూపంలో ₹4.08 కోట్ల ఆదాయం సమకూరింది.
0 Comments:
No comments yet. Be the first to comment!
Leave a Reply