- by John Doe
ఉగ్రవాదాన్ని పెంచితే సహించం.. పాక్‌కు మోదీ స్ట్రాంగ్ వార్నింగ్.!
న్యూఢిల్లీ: ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న పాకిస్తాన్‌కు ప్రధాని నరేంద్ర మోదీ గట్టి హెచ్చరికలు చేశారు. భారత్‌పై ఏదైనా దుస్సాహసానికి పాల్పడితే.. భారత సైన్యం పాక్ భూభాగంలోకి చొరబడి దాడులు చేయగలదని స్పష్టం చేశారు. దేశంలో ఉగ్రవాదం, నక్సలిజంపై కఠిన చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. జమ్మూ కాశ్మీర్ నుంచి ఈశాన్య రాష్ట్రాల వరకు శాంతి నెలకొంటోందని పేర్కొన్నారు. గతంలో భారత విధానాలపై చర్చించిన ప్రపంచం.. ఇప్పుడు దేశ అభివృద్ధి, డైనమిజం గురించి మాట్లాడుకుంటోందని మోదీ అన్నారు.
0 Comments:
No comments yet. Be the first to comment!
Leave a Reply