- by Rrrr
Egg: గుడ్డు వెరీ గుడ్డా? వెరీ బ్యాడా ?
-
- by Rajashekar
- in Health
- 0 likes
Egg: గుడ్డు ఆరోగ్యానికి మంచిదా? హానికరమా? .. ఈ విషయాల్లో చాలామందికి అనేక అపోహలు, భయాలు ఉంటాయి. అసలు గుడ్ల గురించి సైన్స్ ఏం చెబుతోంది? గుడ్డు ఒక 'సూపర్ ఫుడ్'. ఇందులో విటమిన్ D, B12, కోలిన్, లూటిన్ వంటి అద్భుతమైన పోషకాలు ఉన్నాయి. గుడ్డులోని పచ్చసొన తింటే కొలెస్ట్రాల్ పెరిగిపోయి గుండె జబ్బులు వస్తాయని చాలామందిలో ఒక అపోహ ఉంది. నిజానికి గుడ్డు పచ్చసొనలో కొలెస్ట్రాల్ ఉన్న మాట వాస్తవమే. మనం తినే ఆహారంలోని కొలెస్ట్రాల్ వల్ల మన రక్తంలోని కొలెస్ట్రాల్ స్థాయిలు అంతగా పెరగవని ఆధునిక పరిశోధనలు నిరూపించాయి. మన కాలేయం ప్రతిరోజూ సొంతగా కొలెస్ట్రాల్‌ను తయారుచేస్తుంది. మనం ఆహారం ద్వారా కొలెస్ట్రాల్ తీసుకున్నప్పుడు కాలేయం తన ఉత్పత్తిని తగ్గిస్తుంది. కాబట్టి.. ఆరోగ్యవంతులు రోజుకు 1 లేదా 2 గుడ్లు ధైర్యంగా తినవచ్చు.
ప్రజల్లో గుడ్లు ఎక్కువగా తింటే హార్ట్ ఎటాక్ వస్తుందనే అపోహ కూడా ఉంది. హార్వర్డ్ విశ్వవిద్యాలయం వంటి సంస్థలు చేసిన పరిశోధనల ప్రకారం, రోజుకు ఒక గుడ్డు తినడం వల్ల గుండె జబ్బులు లేదా స్ట్రోక్ వచ్చే ప్రమాదం పెరగదు. కానీ ఒక మినహాయింపు ఉంది. డయాబెటిస్ ఉన్నవారు గుడ్లు ఎక్కువగా తింటే గుండె జబ్బుల ముప్పు కొద్దిగా పెరిగే అవకాశం ఉందని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. అందుకే వీళ్ళు డాక్టర్ సలహా మేరకు తీసుకోవడం మంచిది. పచ్చిగుడ్లు తాగితే ఎక్కువ బలం వస్తుందనే అపోహ కూడా ఉంది. ఇది నిజంగానే ప్రమాదకరం. పచ్చి గుడ్లలో లేదా సరిగ్గా ఉడకని గుడ్లలో 'సాల్మొనెల్లా' బ్యాక్టీరియా ఉంటుంది. దీనివల్ల తీవ్రమైన విరేచనాలు, వాంతులు, కడుపునొప్పి రావచ్చు. పచ్చి గుడ్డు కంటే ఉడికించిన గుడ్డులోని ప్రోటీన్‌ను మన శరీరం 90% పైగా గ్రహిస్తుంది. పచ్చి గుడ్డులో ఇది కేవలం 50% మాత్రమే. కాబట్టి గుడ్డును బాగా ఉడికించి లేదా వండుకుని తినడమే మంచిది.
గుడ్డుకు ఎక్కువ వెన్న, చీజ్ లేదా రిఫైండ్ ఆయిల్ వేసి డీప్ ఫ్రై చేస్తే అది ఆరోగ్యానికి హానికరం. ఉడకబెట్టిన గుడ్లు లేదా తక్కువ నూనెతో వేసిన ఆమ్లెట్ మంచిది. అతిగా తింటే అమృతం కూడా విషమే అవుతుంది. గుడ్డు గురించి భయపడాల్సిన పనిలేదు. డయాబెటిస్, గుండె జబ్బులు లేని ప్రతి ఒక్కరూ వైద్యుల సలహాతో తీసుకుంటే మరింత మంచిది.
0 Comments:
No comments yet. Be the first to comment!
Leave a Reply