- by Rrrr
అమ్మను ఇంత అవమానిస్తారని తెలిస్తే అలా మాట్లాడేదాన్ని కాదు: సుష్మిత
హైదరాబాద్: మాజీ మంత్రి కొండా సురేఖను మంత్రి పదవి నుంచి తొలగించిన వ్యవహారంపై ఆమె కూతురు కొండా సుష్మిత తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. కన్నీళ్లు పెట్టుకుంటూ తన తల్లిదండ్రులకు క్షమాపణలు చెప్పారు.
“మా అమ్మ ఏం తప్పు చేసిందని ఇంత అవమానించారు? తన శాఖలో చిన్న అవినీతి కూడా జరగలేదు. నేను మాట్లాడిన మాటల్లో ఇప్పటికీ తప్పు లేదని చెబుతున్నా. ఒకవేళ తప్పు ఉంటే నాపై కేసు పెట్టి జైలుకు పంపాల్సింది” అని సుష్మిత అన్నారు.
“ఒక సామాన్య కార్యకర్త నుంచి మంత్రి స్థాయికి ఎదిగిన మహిళపై సీఎం రేవంత్ రెడ్డి ఇంత పగ పెంచుకుంటారని అనుకోలేదు. మా అమ్మ పార్టీని ఎక్కడా కించపరచలేదు.. కేవలం ఒక వ్యక్తి గురించే మాట్లాడారు” అని వ్యాఖ్యానించారు.
“పార్టీలో నేనైనా ఉండాలి.. ఆమె అయినా ఉండాలి అనే స్థాయికి ముఖ్యమంత్రి దిగజారుతారా? ఒక ఆడబిడ్డ ఉసురు ఊరికే పోదు. రేవంత్ రెడ్డి సోదరుల అక్రమాల చిట్టా నా దగ్గర ఉంది.. దానిపై తర్వాత మాట్లాడతా” అని సుష్మిత పేర్కొన్నారు.
అయితే తన తల్లిదండ్రులు కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతారని స్పష్టం చేశారు. అధిష్ఠానం తన తల్లికి మద్దతుగా ఉన్నప్పటికీ, సీఎం రేవంత్ రెడ్డి ఒత్తిడి కారణంగానే నిర్ణయం తీసుకున్నారని ఆమె ఆరోపించారు.
0 Comments:
No comments yet. Be the first to comment!
Leave a Reply