- by John Doe
విషాదం: కల్తీ మద్యం సేవించి 9 మంది మృతి..!
మధ్యప్రదేశ్: సాగర్ జిల్లాలో కల్తీ మద్యానికి సంబంధించిన ఒక విషాద ఘటన చోటుచేసుకుంది. బండా తహసీల్‌లో కల్తీ మద్యం సేవించిన తొమ్మిది మంది మరణించారు. మరికొందరు విషమ పరిస్థితిలో ఉండగా, వారిని ఆసుపత్రికి తరలించారు. మృతులు బరాజ్ గ్రామానికి చెందినవారిగా పోలీసులు గుర్తించారు. జిల్లా ఎస్పీ అనురాగ్ సుజానియా ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.
0 Comments:
No comments yet. Be the first to comment!
Leave a Reply