విద్యార్థులు చట్టాలపై అవగాహన పెంచుకోవాలి: సీఐ హేమంత్ కుమార్

అనంతపురం: అనంత లక్ష్మి ఇంజినీరింగ్ కళాశాలలో ఇటుకలపల్లి పోలీసులు అవగాహన సదస్సు నిర్వహించారు. విద్యార్థులు చట్టాలపై అవగాహన పెంచుకుని బాధ్యతాయుత పౌరులుగా ఎదగాలని సీఐ హేమంత్ కుమార్ సూచించారు.

ర్యాగింగ్‌కు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. మాదకద్రవ్యాలు, సైబర్ నేరాలకు దూరంగా ఉండాలని సూచించారు. శక్తి యాప్, POCSO చట్టం, బాల్యవివాహాల నిషేధం, ట్రాఫిక్ నిబంధనలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. అత్యవసర సమయంలో 100/112, సైబర్ నేరాలకు 1930కు ఫిర్యాదు చేయాలని తెలిపారు.

author

Rrrr

Author of this article

0 Comments:

No comments yet. Be the first to comment!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

YOU MAY ALSO LIKE