- by Rrrr
రేవంత్ రెడ్డితో ఎలాంటి విభేదాలు లేవు: రాజగోపాల్ రెడ్డి
తెలంగాణ: తాను ఎప్పుడూ సీఎం రేవంత్ రెడ్డిని విమర్శించలేదని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పేర్కొన్నారు. ఒకటి రెండు అంశాలపై భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ, ముఖ్యమంత్రిపై తనకు ఎలాంటి వ్యక్తిగత విభేదాలు లేవని ఆయన స్పష్టం చేశారు.
కొడంగల్, మధిర నియోజకవర్గాలతో సమానంగా తన నియోజకవర్గానికి కూడా నిధులు అందాయని, మునుగోడుకు రూ. 2,000 కోట్లు మంజూరయ్యాయని ఆయన తెలిపారు. వేలాది మంది పార్టీ కార్యకర్తలతో కలిసి ముఖ్యమంత్రి సభకు హాజరవుతానని ఆయన చెప్పారు. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణకు సంబంధించిన తుది నిర్ణయం కాంగ్రెస్ అధిష్టానం చేతిలోనే ఉంటుందని రాజగోపాల్ రెడ్డి నొక్కి చెప్పారు
0 Comments:
No comments yet. Be the first to comment!
Leave a Reply