- by Sandeep
ఏసీబీ ఉక్కుపాదం మోపుతుందని-అవినీతిపై రాజీ లేకుండా చర్యలు కొనసాగిస్తామని- ACB డీజీ చారుసిన్హా!
తెలంగాణ: ఏప్రిల్ 1 నుంచి జూన్ 30, 2026 వరకూ తెలంగాణ ఏసీబీ మొత్తం 10 ఆదాయానికి మించిన అక్రమాస్తుల కేసులు, నమోదయ్యాయి
34 ట్రాప్ కేసులు, 23 ఆకస్మిక తనిఖీలు నిర్వహించి రికార్డు స్థాయిలో కేసులు నమోదు చేసింది.
1983లో ఏసీబీ ప్రారంభమైన తర్వాత ఒకే త్రైమాసికంలో ఇంత భారీ స్థాయిలో కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి అని
ఈ నేపథ్యంలో ఏసీబీ డీజీ చారు సిన్హా ఆధ్వర్యంలో సమీక్ష సమావేశం నిర్వహించి, నమోదైన కేసులు, ట్రాప్ ఆపరేషన్లు, దర్యాప్తు పురోగతి, నిందితులపై తీసుకుంటున్న చర్యలపై విస్తృతంగా చర్చించారు. డీజీ చారు సిన్హా మాట్లాడుతూ,
అధికారుల సమష్టి కృషి, నిబద్ధత వల్లే ఈ రికార్డు సాధ్యమైంది. అవినీతిపై ఏమాత్రం రాజీ లేకుండా మరింత వేగంగా, దర్యాప్తులు కొనసాగించాలని అన్ని యూనిట్లకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశాం.
0 Comments:
No comments yet. Be the first to comment!
Leave a Reply