ఏపీలో రేపటి నుంచి తక్కువ ధరకు బియ్యం విక్రయాలు..!

ఆంధ్రప్రదేశ్ : రాష్ట్ర ప్రజలకు గుడ్‌న్యూస్. తక్కువ ధరల్లో బియ్యం విక్రయాలను ప్రభుత్వం ఆదివారం నుంచి ప్రారంభించనుంది. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవం కారణంగా శనివారం ప్రారంభించాల్సిన కార్యక్రమాన్ని ఒక రోజు వాయిదా వేసింది. రాష్ట్రవ్యాప్తంగా 130 రైతు బజార్లు, 500 రైస్ మిల్లర్ల ప్రత్యేక కౌంటర్ల ద్వారా బియ్యం విక్రయించనున్నారు. మార్కెట్లో కిలో రూ.62 ఉన్న BPT సూపర్ ఫైన్ బియ్యాన్ని రూ.52కే, రూ.58 విలువైన గ్రేడ్-1 రా రైస్‌ను రూ.50కే అందుబాటులోకి తీసుకురానున్నారు. ధరల భారం తగ్గించేందుకు ఈ చర్యలు చేపట్టినట్లు ప్రభుత్వం తెలిపింది

author

Gg

Author of this article

0 Comments:

No comments yet. Be the first to comment!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

YOU MAY ALSO LIKE