- by Srinivas reddy Kalagiri
గుంతలు తవ్విన రాష్ట్రాన్ని నాకు అప్పజెప్పారు: సీఎం చంద్రబాబు
ఏపీలో అభివృద్ధిపైనే ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు. గత ప్రభుత్వం గుంతలతో నిండిన రాష్ట్రాన్ని తమకు అప్పగించిందని, ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా రోడ్లపై ఉన్న గుంతలన్నింటినీ పూడ్చి మెరుగైన రహదారులు అందుబాటులోకి తీసు కొచ్చామని అన్నారు. కూటమి ప్రభుత్వం వెనుకబడిన వర్గాలకు రుణపడి ఉందని, పేదల సంక్షేమానికి ఎంతైనా ఖర్చు పెట్టాలనే సంకల్పం ఉన్నప్పటికీ రాష్ట్ర ఖజానా ఖాళీగా ఉందని పేర్కొన్నారు. అయినప్పటికీ అభివృద్ధి, సంక్షేమం రెండింటినీ సమతూకంగా ముందుకు తీసుకెళ్తున్నామని సీఎం వెల్లడించారు.
0 Comments:
No comments yet. Be the first to comment!
Leave a Reply