- by Sandeep
భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం..!
గోదావరిలో వరద ఉధృతి క్రమంగా పెరుగుతున్న నేప థ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్ అంకిత్, ఎస్పీ రోహిత్ రాజ్ క్షేత్ర స్థాయిలో పర్యటిం చి.. లోతట్టు ప్రాంత వాసులను పునరా వాస కేంద్రాలకు తర లించాలని అధికారు లను ఆదేశించారు.
వరద నీటిమట్టం పెరగడంతో దమ్మాయిగూడెం – భద్రాచలం మధ్య శుక్రవారం సాయం త్రం నుంచి రాకపోక లు నిలిపి వేశారు. గోదావరిలో వరద ఉధృతి కారణంగా.. దుమ్ముగూడెం మండ లంలోని పర్ణశాల వద్ద స్నానఘట్టాలు, సీత వాగు వద్ద సీతమ్మ నారచీరలు, స్వామి వారి సింహాసనం, ఐరన్ ఫుట్ బ్రిడ్జి నీటమునిగాయి.
కూనవరం వద్ద గోదావరి నీటిమట్టం 19.20 మీటర్లకు చేరగా.. పోలవరం వద్ద 11.96 మీటర్ల మేర ప్రవహిస్తోంది..
0 Comments:
No comments yet. Be the first to comment!
Leave a Reply