- by Sandeep
ఆగస్టు 10 వరకు ఎన్యూమరేషన్ దరఖాస్తుల పునఃసమర్పణకు అవకాశం – తల్లోజు ఆచారి
ఆగస్టు 10 వరకు ఎన్యూమరేషన్ దరఖాస్తుల పునఃసమర్పణకు అవకాశం ప్రతి అర్హ ఓటరికి సమాచారం చేరేలా చర్యలు తీసుకోవాలి.
బీజేపీ నేత, జాతీయ బీసీ కమిషన్ మాజీ సభ్యులు శ్రీ తల్లోజు ఆచారి గారు మాట్లాడుతూ, ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (SIR) కార్యక్రమాన్ని అత్యంత బాధ్యతాయుతంగా నిర్వహించాలని పిలుపునిచ్చారు.
ఆగస్టు 10వ తేదీ వరకు ఎన్యూమరేషన్ దరఖాస్తులను తిరిగి సమర్పించుకునే అవకాశం ఉన్నందున, ప్రతి అర్హులైన ఓటరికి ఈ విషయంపై పూర్తి సమాచారం చేరేలా చూడాలని సూచించారు. ప్రతి ఇంటికి వెళ్లి ప్రజలకు అవగాహన కల్పించి, దరఖాస్తుల సమర్పణలో అవసరమైన సహాయ సహకారాలు అందించాలని కోరారు.
ప్రతి బూత్ పరిధిలో BLOలు, BLAలు, సూపర్వైజర్లు సమన్వయంతో పనిచేస్తూ నిరంతరం పర్యవేక్షణ చేపట్టాలని తెలిపారు. ఎలాంటి నిర్లక్ష్యానికి తావివ్వకుండా, అర్హులైన ప్రతి ఓటరి వివరాలు సక్రమంగా నమోదు అయ్యేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు.
ప్రజలకు అవసరమైన మార్గదర్శకత్వం అందిస్తూ, ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (SIR) కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా కృషి చేయాలని శ్రీ తల్లోజు ఆచారి పిలుపునిచ్చారు.
0 Comments:
No comments yet. Be the first to comment!
Leave a Reply