- by Sandeep
30 వేల క్యూసెక్కుల నీటిని శ్రీశైలం ప్రాజెక్టుకు చేరుతున్నాయి!
కర్ణాటకలో కురుస్తున్న భారీ వర్షాలతో కృష్ణా నదిలో వరద ప్రవాహం పెరుగుతోంది. ఆలమట్టి జలాశయం గరిష్ఠ నీటి మట్టానికి 4 టీఎంసీల దూరంలో ఉండగా, నారాయణపూర్ పూర్తిగా నిండిపోయి అక్కడి నుంచి 84,300 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఆ నీరు జూరాల ప్రాజెక్టుకు చేరుతుండగా, అక్కడి విద్యుత్ కేంద్రం నుంచి ఇప్పటికే 30 వేల క్యూసెక్కుల నీటిని శ్రీశైలం ప్రాజెక్టుకు వదులుతున్నారు. వరద ప్రవాహం మరింత పెరుగుతున్న నేపథ్యంలో జూరాల గేట్లు నేడు ఎత్తే అవకాశం ఉండటంతో, శ్రీశైలం ప్రాజెక్టుకు కృష్ణమ్మ జలాల రాక మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.
0 Comments:
No comments yet. Be the first to comment!
Leave a Reply