శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో బుల్లెట్‌ కలకలం

హైదరాబాద్‌: శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో తనిఖీల సందర్భంగా ఓ ప్రయాణికుడి వద్ద బుల్లెట్‌ లభించడం కలకలం రేపింది. శంషాబాద్‌ నుంచి అబుదాబి వెళ్లేందుకు వచ్చిన ప్రయాణికుడి వద్ద తనిఖీల్లో బుల్లెట్‌ను అధికారులు గుర్తించినట్లు సమాచారం.


భద్రతా సిబ్బంది తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో ప్రయాణికుడి వద్ద బుల్లెట్‌ ఉన్నట్లు గుర్తించారు. వెంటనే అతడిని అదుపులోకి తీసుకుని తదుపరి విచారణ నిమిత్తం శంషాబాద్‌ జీఎంఆర్‌ ఔట్‌పోస్ట్‌ పోలీసులకు అప్పగించినట్లు తెలుస్తోంది.


బుల్లెట్‌ ప్రయాణికుడి వద్దకు ఎలా వచ్చింది, దానిని విమానాశ్రయానికి ఎందుకు తీసుకువచ్చారనే అంశాలపై పోలీసులు విచారణ చేపట్టినట్లు సమాచారం. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తు అనంతరం వెల్లడయ్యే అవకాశం ఉంది.

author

Srinivas reddy Kalagiri

Author of this article

0 Comments:

No comments yet. Be the first to comment!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

YOU MAY ALSO LIKE