- by John Doe
తెలంగాణ విద్యుత్ వినియోగదారులపై ట్రూ అప్ ఛార్జీల భారం.!
-
- by Srinivas reddy Kalagiri
- in National
- 0 likes
హైదరాబాద్: తెలంగాణ విద్యుత్ వినియోగదారులపై మరోసారి ట్రూ అప్ ఛార్జీల భారం పడనుంది. నవంబర్ నుంచి ట్రూ అప్ ఛార్జీల వసూలుకు తెలంగాణ విద్యుత్ నియంత్రణ మండలి అనుమతి ఇచ్చినట్లు సమాచారం.
నవంబర్ నుంచి యూనిట్ విద్యుత్‌కు 30 పైసల చొప్పున ట్రూ అప్ ఛార్జీలు వసూలు చేయనున్నారు. డిసెంబర్ నుంచి ఈ మొత్తం యూనిట్‌కు 50 పైసలకు పెరగనుంది. దీంతో గృహ, వాణిజ్య, ఇతర విద్యుత్ వినియోగదారులపై అదనపు భారం పడనుంది.
దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థకు 29 నెలల పాటు, ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థకు 26 నెలల పాటు ట్రూ అప్ ఛార్జీలను వసూలు చేసేందుకు ఈఆర్‌సీ అనుమతించినట్లు సమాచారం.
విద్యుత్ కొనుగోలు, సరఫరా తదితర వ్యయాల్లో ఏర్పడిన వ్యత్యాసాలను సర్దుబాటు చేసేందుకు ట్రూ అప్ ఛార్జీలను వసూలు చేస్తారు. తాజా నిర్ణయంతో నవంబర్, డిసెంబర్ నుంచి విద్యుత్ బిల్లుల్లో అదనపు ఛార్జీలు చేరనున్నాయి.
0 Comments:
No comments yet. Be the first to comment!
Leave a Reply