- by John Doe
ప్రేమించి మోసం చేశాడంటూ ప్రియుడి ఇంటి ముందు యువతి ధర్నా
-
- by Srinivas reddy Kalagiri
- in National
- 0 likes
వరంగల్: తనను ప్రేమించి పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేశాడంటూ ఓ దళిత యువతి ప్రియుడి ఇంటి ముందు ధర్నాకు దిగింది. వర్ధన్నపేటలో ఈ ఘటన చోటుచేసుకుంది. మున్సిపల్ చైర్మన్ పాలకుర్తి సారంగపాణి కుమారుడు పాలకుర్తి శ్రీకాంత్ తనను ప్రేమించి, పెళ్లి చేసుకుంటానని చెప్పి అనంతరం వివాహానికి నిరాకరిస్తున్నాడని యువతి ఆరోపించింది.
శ్రీకాంత్ ఇంటి ముందు టెంట్ ఏర్పాటు చేసుకున్న యువతి అక్కడే ఆందోళనకు దిగింది. ఆమెకు మద్దతుగా మహిళలు, కుల సంఘాల ప్రతినిధులు, బంధువులు అక్కడికి చేరుకుని ధర్నాలో పాల్గొన్నారు.
ప్రేమ పేరుతో తనను అన్ని విధాలుగా ఉపయోగించుకున్నారని, పెళ్లి చేసుకోవాలని కోరినప్పటికీ శ్రీకాంత్ నిరాకరించడంతో తాను ఆందోళనకు దిగాల్సి వచ్చిందని యువతి ఆరోపించింది. తనకు శ్రీకాంత్‌తో వివాహం జరిపించి న్యాయం చేయాలని ఆమె డిమాండ్ చేస్తోంది.
తనకు న్యాయం జరిగే వరకు ఆందోళన కొనసాగిస్తానని యువతి స్పష్టం చేసినట్లు సమాచారం. ఈ ఆరోపణలపై శ్రీకాంత్ లేదా ఆయన కుటుంబ సభ్యుల స్పందన, పోలీసుల అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.
0 Comments:
No comments yet. Be the first to comment!
Leave a Reply