- by John Doe
సైబర్ మోసగాళ్లపై తెలంగాణ పోలీసుల భారీ ఆపరేషన్
-
- by Srinivas reddy Kalagiri
- in National
- 0 likes
ఆరు రాష్ట్రాల్లో దాడులు.. 101 మంది అరెస్ట్
హైదరాబాద్: సైబర్ నేరగాళ్లపై తెలంగాణ పోలీసులు భారీ ఆపరేషన్ చేపట్టారు. ఆరు రాష్ట్రాల్లో ఏకకాలంలో నిర్వహించిన ఆపరేషన్‌లో 101 మందిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. అరెస్టైన వారిలో 18 మంది మహిళలు, 83 మంది పురుషులు ఉన్నారు.
తెలంగాణ సైబర్ క్రైమ్ బ్యూరో ఆధ్వర్యంలో కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ, పుదుచ్చేరి ప్రాంతాల్లో ఈ ఆపరేషన్ నిర్వహించినట్లు సమాచారం. మొత్తం 1,172 సైబర్ నేర కేసుల్లో నిందితులను గుర్తించి పట్టుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.
సైబర్ నేరగాళ్లకు బ్యాంకు ఖాతాలు, ఇతర ఆర్థిక లావాదేవీలకు ఉపయోగించే ‘మ్యూల్ అకౌంట్స్’ సమకూరుస్తున్న ముఠాలపై ప్రధానంగా దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఈ ఖాతాలను ఉపయోగించి సైబర్ మోసాల ద్వారా వచ్చిన నగదును వివిధ మార్గాల్లో తరలిస్తున్నట్లు పోలీసులు గుర్తించినట్లు సమాచారం.
ఆరు రాష్ట్రాల్లో సమన్వయంతో నిర్వహించిన ఈ ఆపరేషన్‌లో అరెస్టైన నిందితుల పాత్ర, వారి నెట్‌వర్క్, మ్యూల్ అకౌంట్ల వినియోగానికి సంబంధించిన వివరాలపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
0 Comments:
No comments yet. Be the first to comment!
Leave a Reply