- by John Doe
ఈసీ కార్యాలయం వద్ద విపక్ష ఎంపీల ఆందోళన.!
-
- by Srinivas reddy Kalagiri
- in National
- 0 likes
బారికేడ్లను దాటి నిరసనకు యత్నం.. ఎంపీలను అదుపులోకి తీసుకున్న పోలీసులు
న్యూఢిల్లీ: కేంద్ర ఎన్నికల సంఘం కార్యాలయం వద్ద విపక్ష ఎంపీలు ఆందోళన చేపట్టారు. ఈసీ కార్యాలయం వైపు వెళ్లేందుకు ప్రయత్నించిన ఎంపీలను పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేసి అడ్డుకున్నారు.
ఈ సందర్భంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ బారికేడ్లపైకి ఎక్కి జాతీయ జెండాతో నిరసన వ్యక్తం చేసినట్లు సమాచారం. విపక్ష ఎంపీలు ఈసీ కార్యాలయం వైపు వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు వారిని అడ్డుకున్నారు.
పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు పలువురు విపక్ష ఎంపీలను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈసీ కార్యాలయం పరిసరాల్లో భారీగా పోలీసు బలగాలను మోహరించి భద్రతను కట్టుదిట్టం చేశారు.
0 Comments:
No comments yet. Be the first to comment!
Leave a Reply