- by John Doe
నాకు ప్రజలే భగవంతుడి స్వరూపం: ప్రధాని మోదీ
-
- by Srinivas reddy Kalagiri
- in National
- 0 likes
న్యూఢిల్లీ: దేశ ప్రజలే తనకు భగవంతుడి స్వరూపమని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. దేశ ప్రజలకు సేవ చేసేందుకు మరింత శక్తిని ప్రసాదించాలని భగవంతుడిని ప్రార్థించినట్లు తెలిపారు.
బుధవారం ఉదయం వినాయక మందిరంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన మోదీ.. దేశ ప్రజలందరి కోసం తాను పూజలు చేసినట్లు చెప్పారు. ప్రజలకు మరింత సేవ చేసే శక్తిని తనకు ఇవ్వాలని భగవంతుడిని ప్రార్థించినట్లు వెల్లడించారు.
‘‘నాకు ప్రజలే భగవంతుడి స్వరూపం. దేశం నాకు ఎంతో ఇచ్చింది. అందుకే దేశమే నాకు ప్రథమ ప్రాధాన్యం’’ అని మోదీ పేర్కొన్నారు.
దేశ సేవకు అంకితమై పనిచేయడమే తన ప్రధాన లక్ష్యమని ఈ సందర్భంగా ప్రధాని స్పష్టం చేశారు.
0 Comments:
No comments yet. Be the first to comment!
Leave a Reply