- by John Doe
ఏసీబీ వలలో రంగారెడ్డి డీఎంహెచ్‌వో స్వర్ణకుమారి.!
-
- by Srinivas reddy Kalagiri
- in National
- 0 likes
రూ.లక్ష లంచం తీసుకుంటూ పట్టుబడ్డట్లు సమాచారం
హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా వైద్య ఆరోగ్య అధికారి (డీఎంహెచ్‌వో) స్వర్ణకుమారి అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులకు చిక్కినట్లు సమాచారం. రూ.లక్ష లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు ఆమెను పట్టుకున్నట్లు తెలిసింది.
రంగారెడ్డి జిల్లా వైద్య ఆరోగ్య అధికారిగా కొనసాగుతున్న స్వర్ణకుమారిని ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. లంచం వ్యవహారానికి సంబంధించి పూర్తి వివరాలను అధికారులు సేకరిస్తున్నట్లు తెలుస్తోంది.
ఈ ఘటనపై ఏసీబీ అధికారులు తదుపరి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. లంచం ఎవరి నుంచి, ఏ పని కోసం తీసుకున్నారనే వివరాలతో పాటు కేసుకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఏసీబీ అధికారులు వెల్లడించాల్సి ఉంది.
0 Comments:
No comments yet. Be the first to comment!
Leave a Reply