- by John Doe
రవీంద్రభారతిలో ఘనంగా గడ్డం వెంకటస్వామి 97వ జయంతి ఉత్సవాలు
-
- by Srinivas reddy Kalagiri
- in National
- 0 likes
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం, భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో స్వర్గీయ గడ్డం వెంకటస్వామి ‘కాకా’ 97వ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టీపీసీసీ ఉపాధ్యక్షురాలు ఝాన్సీ రాజేందర్‌రెడ్డి హాజరయ్యారు.
రాష్ట్ర మంత్రి వివేక్ వెంకటస్వామి ఆహ్వానం మేరకు కార్యక్రమంలో పాల్గొన్న ఝాన్సీ రాజేందర్‌రెడ్డి.. గడ్డం వెంకటస్వామి ‘కాకా’ అందించిన సేవలను స్మరించుకున్నారు. ప్రజా జీవితంలో ఆయన చేసిన సేవలను ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు.
కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.
0 Comments:
No comments yet. Be the first to comment!
Leave a Reply