- by John Doe
కోరుట్ల రవాణాశాఖ కార్యాలయంలో ఏసీబీ సోదాలు.!
-
- by Srinivas reddy Kalagiri
- in National
- 0 likes
జగిత్యాల: జగిత్యాల జిల్లా కోరుట్ల రవాణాశాఖ కార్యాలయంలో మంగళవారం అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు సోదాలు నిర్వహించారు. కార్యాలయాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్న అధికారులు లోపలికి ఎవరినీ అనుమతించలేదు.
సోదాల్లో భాగంగా కార్యాలయంలోని పలు రికార్డులు, సంబంధిత పత్రాలను ఏసీబీ అధికారులు పరిశీలించినట్లు సమాచారం. కార్యాలయంలోని వివిధ విభాగాల్లో పత్రాలు, రికార్డులను తనిఖీ చేసినట్లు తెలుస్తోంది.
సోదాలకు సంబంధించిన పూర్తి వివరాలను మరికాసేపట్లో వెల్లడిస్తామని ఏసీబీ అధికారులు తెలిపారు. సోదాలు కొనసాగుతున్న సమయంలో రవాణాశాఖ కార్యాలయం వద్ద కొంతసేపు ఉత్కంఠ నెలకొంది.
0 Comments:
No comments yet. Be the first to comment!
Leave a Reply