- by John Doe
తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. 18 గంటల సర్వదర్శనం!
-
- by Srinivas reddy Kalagiri
- in Devotional
- 0 likes
తిరుమల: తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తుల రద్దీ కొనసాగుతోంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని అన్ని కంపార్ట్‌మెంట్లు నిండిపోవడంతో టోకెన్ లేని భక్తులు వెలుపల ఏర్పాటు చేసిన క్యూలైన్లలో వేచి ఉన్నారు. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి సుమారు 18 గంటల సమయం పడుతున్నట్లు టీటీడీ వర్గాలు తెలిపాయి.
ఆదివారం పెద్ద సంఖ్యలో భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. మొత్తం 83,578 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోగా, 31,137 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు.
భక్తుల నుంచి హుండీ ద్వారా శ్రీవారి ఆలయానికి రూ.5.07 కోట్ల ఆదాయం సమకూరింది. రద్దీ దృష్ట్యా క్యూ లైన్లలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా టీటీడీ అధికారులు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.
దర్శనం కోసం వేచి ఉన్న భక్తులకు తాగునీరు, అన్నప్రసాదం తదితర సౌకర్యాలను అందుబాటులో ఉంచినట్లు అధికారులు తెలిపారు.
0 Comments:
No comments yet. Be the first to comment!
Leave a Reply