కొండగట్టు అంజన్న సన్నిధిలో హీరో వరుణ్‌ తేజ్‌, జస్టిస్‌ వేణుగోపాల్

జగిత్యాల: జగిత్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి ఆలయం ఆదివారం ప్రముఖుల రాకతో సందడిగా మారింది. తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఈ.వి. వేణుగోపాల్‌, టాలీవుడ్‌ హీరో వరుణ్‌ తేజ్‌ వేర్వేరుగా కొండగట్టు అంజన్నను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.


ఉదయం ఆలయానికి విచ్చేసిన జస్టిస్‌ ఈ.వి. వేణుగోపాల్‌కు ఆలయ కార్యనిర్వహణాధికారి అంజనా రెడ్డి పూర్ణకుంభంతో, వేద మంత్రోచ్ఛారణల మధ్య ఘన స్వాగతం పలికారు. అనంతరం జస్టిస్‌ వేణుగోపాల్‌ స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు ఆయనకు ఆశీర్వచనం అందించి తీర్థప్రసాదాలు, శేషవస్త్రం అందజేశారు.


అనంతరం ఆలయానికి చేరుకున్న హీరో వరుణ్‌ తేజ్‌కు ఆలయ అధికారులు సాదర స్వాగతం పలికారు. స్వామివారిని దర్శించుకున్న అనంతరం ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.


కొండగట్టుకు రాగానే ప్రశాంతంగా ఉంటుంది


ఈ సందర్భంగా వరుణ్‌ తేజ్‌ మాట్లాడుతూ కొండగట్టు అంజన్న దర్శనం ఎప్పుడూ గొప్ప అనుభూతిని కలిగిస్తుందని అన్నారు. కొండగట్టుకు రాగానే మనసు ఎంతో ప్రశాంతంగా ఉంటుందని పేర్కొన్నారు. స్వామివారి ఆశీస్సులు ప్రజలందరిపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు.


తెలంగాణలో ఇంతటి మహిమాన్వితమైన పుణ్యక్షేత్రం ఉండటం మన అదృష్టమని అన్నారు. తన సినిమా విజయవంతం కావాలని, ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని అంజన్నను ప్రార్థించినట్లు వరుణ్‌ తేజ్‌ తెలిపారు.


కార్యక్రమాల్లో ఆలయ సూపరింటెండెంట్‌, అర్చకులు, వేద పండితులు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.

author

Srinivas reddy Kalagiri

Author of this article

0 Comments:

No comments yet. Be the first to comment!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

YOU MAY ALSO LIKE