- by John Doe
మతసామరస్యానికి ప్రతీకగా ముస్లిం దంపతుల ధర్మపురి దర్శనం!
-
- by Srinivas reddy Kalagiri
- in Devotional
- 0 likes
లక్ష్మీనరసింహ స్వామికి తులసి అర్చన.. ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎస్‌కే మల్సూర్, హలీమా దంపతులు
ధర్మపురి: మతసామరస్యం, సర్వమత ఐక్యతకు ప్రతీకగా నిలిచే సంఘటన ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి క్షేత్రంలో చోటుచేసుకుంది. ఖమ్మం జిల్లా కూసుమంచి గ్రామానికి చెందిన ముస్లిం దంపతులు ఎస్‌కే మల్సూర్, హలీమా ఆదివారం ధర్మపురి క్షేత్రాన్ని సందర్శించి స్వామివారిని దర్శించుకున్నారు.
రానున్న ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకుని ఆలయానికి చేరుకున్న దంపతులు స్వామివారికి తులసి అర్చన నిర్వహించి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయంలో నిర్వహించే పూజా కార్యక్రమాలు, ముక్కోటి ఏకాదశి విశిష్టత గురించి తెలుసుకున్నారు. భక్తిశ్రద్ధలతో మొక్కులు చెల్లించుకుని స్వామివారి ఆశీస్సులు పొందారు.
వివిధ మతాలకు చెందిన ప్రజలు పరస్పర గౌరవం, విశ్వాసంతో కలిసిమెలిసి జీవించాలనే సందేశాన్ని ఈ దంపతుల ఆలయ సందర్శన చాటిచెప్పింది. మతాలకతీతంగా భక్తి, మానవత్వం, సోదరభావమే సమాజాన్ని ఐక్యంగా ఉంచుతాయని ఈ ఘటన మరోసారి గుర్తుచేసింది.
0 Comments:
No comments yet. Be the first to comment!
Leave a Reply