విధులకు గైర్హాజరైన 70 మంది వైద్యులపై వేటు

మరో 193 మందిపై చర్యలకు ఏపీ ప్రభుత్వం ఆదేశం


విధులకు తరచూ గైర్హాజరవుతున్నారనే ఆరోపణల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం వైద్యులపై కఠిన చర్యలకు ఉపక్రమించింది. ఇందులో భాగంగా 70 మంది వైద్యులను ఉద్యోగాల నుంచి తొలగించినట్లు సమాచారం. మరో 193 మంది వైద్యులపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ప్రభుత్వం ఆదేశించింది.


ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య సేవలకు అంతరాయం కలగకుండా చూడటంతో పాటు విధుల పట్ల బాధ్యతాయుతంగా వ్యవహరించేలా సిబ్బందిలో జవాబుదారీతనం పెంచడమే ఈ చర్యల ఉద్దేశమని తెలుస్తోంది. గైర్హాజరైన వైద్యుల వివరాలను పరిశీలించి, నిబంధనల ప్రకారం తదుపరి చర్యలు చేపట్టాలని ప్రభుత్వం ఆదేశించినట్లు సమాచారం.

author

Srinivas reddy Kalagiri

Author of this article

0 Comments:

No comments yet. Be the first to comment!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

YOU MAY ALSO LIKE