జానీ మాస్టర్‌పై సహాయ నిరాకరణ.. ఫిల్మ్‌ ఫెడరేషన్‌ కీలక నిర్ణయం

హైదరాబాద్‌: ప్రముఖ కొరియోగ్రాఫర్‌ జానీ మాస్టర్‌పై కొనసాగుతున్న సహాయ నిరాకరణను కొనసాగించాలని తెలుగు ఫిల్మ్‌ ఇండస్ట్రీ ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌ నిర్ణయించింది. ఈ మేరకు అనుబంధ సంఘాలు, వాటి నాయకులు, సభ్యులు ఫెడరేషన్‌ నిర్ణయాలను తప్పనిసరిగా పాటించాలని సూచించింది.


సెప్టెంబర్‌ 26, 27 తేదీల్లో జరిగిన ఆల్‌ ఇండియా ఫిల్మ్‌ ఎంప్లాయీస్‌ కాన్ఫెడరేషన్‌ సమావేశంలో జానీ మాస్టర్‌ వ్యవహారంపై చర్చ జరిగినట్లు ఫెడరేషన్‌ తెలిపింది. గత పరిణామాలపై ఫెడరేషన్‌ నాయకులతో చర్చించిన అనంతరం సభ్యుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని నాన్‌-కోఆపరేషన్‌ కొనసాగించాలని నిర్ణయించినట్లు పేర్కొంది. ఈ నిర్ణయానికి ఏఐఎఫ్‌ఈసీ సమావేశంలోనూ మద్దతు లభించిందని ఫెడరేషన్‌ వెల్లడించింది.


నిర్ణయాన్ని ఉల్లంఘిస్తే చర్యలు


ఫెడరేషన్‌ నిర్ణయాలను అనుబంధ సంఘాలు, నాయకులు, సభ్యులు పాటించాలని స్పష్టం చేసింది. వ్యక్తిగత ప్రయోజనాల కోసం నిర్ణయాన్ని ఎవరైనా ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని ఫెడరేషన్‌ హెచ్చరించినట్లు సమాచారం.


మరోవైపు ఈ నిర్ణయంపై జానీ మాస్టర్‌ భార్య, డ్యాన్సర్స్‌ యూనియన్‌ అధ్యక్షురాలు సుమలత స్పందించారు. జానీ మాస్టర్‌పై విధించిన సహాయ నిరాకరణను, సస్పెన్షన్‌ను ఎత్తివేయాలని ఆమె డిమాండ్‌ చేశారు. ఫెడరేషన్‌ అధ్యక్షుడిపై కూడా ఆమె పలు ఆరోపణలు చేశారు.


జానీ మాస్టర్‌ వ్యవహారంతో పాటు తెలుగు సినీ డ్యాన్సర్స్‌ అసోసియేషన్‌లో నెలకొన్న వివాదం కూడా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఫిల్మ్‌ ఫెడరేషన్‌ తాజా నిర్ణయం సినీ పరిశ్రమలో చర్చనీయాంశంగా మారింది.

author

Srinivas reddy Kalagiri

Author of this article

0 Comments:

No comments yet. Be the first to comment!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

YOU MAY ALSO LIKE