- by John Doe
శంకరన్న’గా అదరగొట్టిన ప్రియదర్శి.. హరీశ్‌రావు ప్రశంసలు
-
- by Srinivas reddy Kalagiri
- in Movies
- 0 likes
‘బలగం’, ‘మల్లేశం’ నుంచి ‘ది ప్యారడైజ్’ వరకు నటనకు అభినందనలు.. సత్కరించిన మాజీ మంత్రి
హైదరాబాద్: ‘ది ప్యారడైజ్’ సినిమాలో ‘శంకరన్న’ పాత్రలో నటించిన ప్రియదర్శిపై మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు ప్రశంసలు కురిపించారు. ‘బలగం’, ‘మల్లేశం’ చిత్రాల నుంచి ‘ది ప్యారడైజ్’ వరకు ప్రియదర్శి తన నటనతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారని అభినందించారు.
‘ది ప్యారడైజ్’లో ఎమ్మెల్యే శంకరన్న పాత్రలో ప్రియదర్శి తెలంగాణ యాస, హావభావాలు, మేనరిజమ్స్, స్క్రీన్ ప్రెజెన్స్‌తో ఆకట్టుకున్నారని హరీశ్‌రావు పేర్కొన్నారు. ఈ పాత్రలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను గుర్తుచేసే పోలికలు ఉన్నాయనే చర్చ కూడా సినిమా విడుదల అనంతరం సాగుతోంది. ప్రియదర్శి కూడా పాత్ర కోసం కేసీఆర్ దుస్తులు, చెప్పులు, బాడీ లాంగ్వేజ్ తదితర అంశాలపై ప్రత్యేకంగా పరిశోధన చేసినట్లు వెల్లడించారు.
డైలాగ్‌ను ప్రస్తావిస్తూ ప్రశంసలు
సినిమాలోని “చావు నోట్లో తల పెట్టయినా.. మీకు గుర్తింపు తెస్తా” అనే శంకరన్న డైలాగ్‌ను ప్రస్తావించిన హరీశ్‌రావు.. ప్రియదర్శిని సత్కరించి అభినందించారు.
‘ది ప్యారడైజ్’ చిత్ర బృందానికి హరీశ్‌రావు శుభాకాంక్షలు తెలిపారు. ప్రియదర్శి భవిష్యత్‌లో మరిన్ని వైవిధ్యమైన, గుర్తుండిపోయే పాత్రల్లో నటించి విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.
ఇదిలా ఉండగా, ‘ది ప్యారడైజ్’లో ప్రియదర్శి పోషించిన శంకరన్న పాత్ర విడుదల అనంతరం ప్రేక్షకులు, సోషల్ మీడియా వర్గాల్లో ప్రత్యేకంగా చర్చనీయాంశమైంది. పాత్ర కోసం తాను చేసిన సన్నద్ధత, పరిశోధన గురించి ప్రియదర్శి ఇటీవల వెల్లడించిన విషయం తెలిసిందే.
0 Comments:
No comments yet. Be the first to comment!
Leave a Reply