- by Rrrr
Walk: మార్నింగ్ వాక్ కి వెళ్లే ముందు టాయిలెట్‌కి వెళ్తున్నారా? లేదా ?
-
- by Rajashekar
- in Health
- 0 likes
Morning Walk: చాలామంది ఉదయాన్నే నిద్రలేచిన వెంటనే టాయిలెట్‌కి వెళ్లకుండా నేరుగా వాకింగ్‌కి బయలుదేరుతుంటారు. కానీ మనలో చాలామంది చేసే బిగ్గెస్ట్ మిస్టేక్ ఇదే అని అంటున్నారు ఆరోగ్య నిపుణులు.
ఫ్రెండ్స్ వాకింగ్ కి వెళ్తున్నారని 'పొద్దున్నే మోషన్ రావట్లేదని కొందరు.. వచ్చాక చూద్దాంలే అని ఇంకొందరు టాయిలెట్ కి వెళ్లడం వాయిదా వేస్తుంటారు. కొద్దీ దూరం పరుగెత్తగానే కడుపులో దేవడం మొదలై, బాత్‌రూమ్ ఎక్కడ ఉందా అని దేవుడికి దండం పెట్టుకొని ఇంటికి పరుగెత్తిన వారు కూడా ఉంటారు. కానీ సిగ్గు, బిడియంతో ఎవరికీ చెప్పుకోలేకపోతారు. ఇలా చేయడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
పొట్ట ఖాళీ కాకుండా మనం ఎక్సర్‌సైజ్ చేస్తే జీర్ణవ్యవస్థపై ప్రెజర్ పడుతుంది. దీంతో పొత్తికడుపులో నొప్పులు మొదలవుతాయి. అందుకే ఉందయం వేళ మనసులో ఎలాంటి చెడు ఆలోచనలు రానీయకుండా ప్రశాంతమైన మనసుతో వాకింగ్ కు వెళ్ళాలి. అలాగే పొట్టను ఖాళీగా ఉంచుకొని వాకింగ్ చేస్తే ఎంతో మంచిది. మరి ఉదయాన్నే ఫ్రీగా మోషన్ అవ్వాలంటే కొన్ని టిప్స్ పాటించాలి. అవేంటంటే..
గోరు వెచ్చని నీళ్లు తాగాలి : ఉదయం నిద్ర లేవగానే కనీసం ఒక గ్లాస్ గోరువెచ్చని నీళ్లు తాగాలి. అది మీ జీర్ణవ్యవస్థను రీస్టార్ట్ చేస్తుంది.
బాత్‌రూమ్‌లో ప్రశాంతంగా కూర్చోవాలి : బాత్‌రూమ్‌లో కంగారుపడకుండా ప్రశాంతంగా కూర్చోవాలి. వీటితోపాటు ఇంట్లోనే తేలికపాటి స్ట్రెచింగ్స్ లేదా యోగా చేస్తే పేగుల కదలికలు బాగుంటాయి అంటున్నారు వైద్య నిపుణులు. అర్థమయ్యింది కదా ఫ్రెండ్స్.. ఇకనుంచి మీరు కానీ, మీ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ ఈ విషయంలో ఏమాత్రం పొరపాటు చేసినా వెంటనే మీ సమస్యను తగ్గించుకునే ప్రయత్నం చేయండి. ఇలా చేస్తే అందం, ఆరోగ్యం మీ సొంతమవడం ఖాయం.
0 Comments:
No comments yet. Be the first to comment!
Leave a Reply