- by Rrrr
Diabetes: దాల్చిన చెక్కతో షుగర్ కు చెక్ పెట్టవచ్చు !
-
- by Rajashekar
- in Health
- 0 likes
Diabetes: మన వంటింట్లో ఉండే పోషకాల గని 'దాల్చిన చెక్క'. ఈ దాల్చిన చెక్కను మనం కేవలం వంటల్లో రుచి కోసం మాత్రమే ఎక్కువగా వాడుతుంటాం. కానీ ఈ దాల్చిన చెక్క షుగర్ ను కంట్రోల్ లో ఉంచుతుందనే విషయం మీకు తెలుసా? ఇది మన శరీరంలో ఇన్సులిన్ హార్మోన్ వలె పనిచేస్తుంది. దీన్ని ఎక్కువ మోతాదులో తీసుకుంటే లివర్ పై ప్రభావం పడే అవకాశం ఉంది. అందువల్ల దాల్చిన చెక్కను మితంగా తీసుకోవాలి. ఇలా మితంగా తీసుకుంటే ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ లెవెల్స్ సులభంగా తగ్గుతాయని వైద్య నిపుణులు చెబుతున్నారు.
మన శరీరంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ మరియు ట్రైగ్లిజరైడ్స్ ని తగ్గించడంలో దాల్చిన చెక్క అద్భుతంగా పనిచేస్తుంది. దీంతోపాటు మన శరీరానికి కావాల్సిన మంచి కొలెస్ట్రాల్ స్థాయిలను కూడా స్థిరంగా ఉంచుతుంది. దాల్చిన చెక్కలోని యాంటీ ఆక్సిడెంట్లు మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు గుండె ధమనుల్లోకి కొవ్వు చేరకుండా చేసి గుండెపోటు, బ్లడ్ ప్రెషర్ ప్రమాదాన్ని తగ్గిస్తాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ దాల్చిన చెక్కను వాడే ముందు.. ఇప్పటికే డయాబెటిస్, BPకి మందులు వాడుతున్నవారు డాక్టర్ సలహా తీసుకున్న తర్వాత వాడితేనే మంచిది.
0 Comments:
No comments yet. Be the first to comment!
Leave a Reply