Health: పిల్లల్లో ఎముకల బలానికి చేపలు తినిపించాలా?

Health: పిల్లలలో ఎముకల ఎదుగుదలకు, బలానికి చేపలు ఎంతో శ్రేష్ఠమైన ఆహారం. ఎముకల బలానికి కేవలం క్యాల్షియం మాత్రమే కాకుండా విటమిన్ డి, ప్రోటీన్ మరియు ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు కూడా అవసరం. ఇవన్నీ చేపలలో సమృద్ధిగా లభిస్తాయి. చేపల కాలేయంలో ఉండే విటమిన్ D ఎముకల పెరుగుదలకు సహకరిస్తుంది. పిల్లలు చేపలను తీసుకోవడం వల్ల హీమోగ్లోబిన్‌ స్థాయిల్ని పొందవచ్చు. చేపల్లో అయోడిన్ కూడా పుష్కలంగా ఉంటుంది. వారానికి రెండుసార్లు చేపలు తీసుకుంటే పిల్లల్లో మెదడు ఎదుగుదల జరుగుతుంది. కాబట్టి పిల్లలకు వారంలో 2 రోజులు చేపలు ఇవ్వాలి. రోజూ చేపలు తీసుకునేవారిలో గుండెజబ్బులు, మధుమేహం, పక్షవాతం లాంటి సమస్యలు వచ్చే ప్రమాదం తక్కువగా ఉంటుందని పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. పొట్ట చుట్టూ కొవ్వు, హైబీపీ, రక్తంలో చక్కెర పెరగటం, మంచి కొలెస్ట్రాల్‌ తగ్గటానికి చేపలే దివ్యౌషధంగా పనిచేస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. 


శరీరంలో క్యాల్షియం అబ్జార్బ్ అవ్వడానికి విటమిన్ D చాలా ముఖ్యం. సాల్మన్, మాకరెల్, ట్యూనా వంటి సముద్ర చేపల్లో విటమిన్ D పుష్కలంగా ఉంటుంది. మెత్తని ముల్లుతో ఉండే చిన్న చేపలు పిల్లలకు వండి పెడితే ఎముకలకు నేరుగా లభించే క్యాల్షియం, పాస్పరస్ పరిమాణం పెరుగుతుంది. ఎముకల సాంద్రతను పెంచడానికి, ఎముకలు బలహీనపడకుండా రక్షించడానికి ఇవి తోడ్పడతాయి. వారానికి 1 నుండి 2 సార్లు పిల్లల ఆహారంలో చేపలను చేర్చడం వల్ల వారి ఎముకలు గట్టిపడటమే కాకుండా మెదడు చురుకుదనంతో పాటు కంటి చూపు కూడా మెరుగుపడుతుంది. ఎముకలు, కండరాల నిర్మాణానికి, పిల్లల శారీరక ఎదుగుదలకు అవసరమైన ప్రోటీన్ దీని ద్వారా లభిస్తుంది. అయితే పిల్లలకు చేపలు తినిపించేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం మర్చిపోవద్దు. 


పిల్లలకు చేపలు తినిపించేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు:

1. పిల్లలకు చేపలు ఇచ్చేటప్పుడు ముళ్ళు లేని చేప ముక్కలను లేదా ముళ్ళు తీసేసిన చేపలను స్వయంగా మనమే ఇవ్వాలి. 

2. నూనెలో ఎక్కువగా డీప్ ఫ్రై చేయడం కంటే కూరగా లేదా గ్రిల్/స్టీమ్ చేసి ఇవ్వడం వల్ల పోషకాలు దెబ్బతినకుండా ఉంటాయి.

3. మెర్క్యురి తక్కువగా ఉండే చిన్న చేపలు, సాల్మన్, బొచ్చె వంటివి పిల్లలకు సురక్షితమైనవి.

author

Rajashekar

Author of this article

0 Comments:

No comments yet. Be the first to comment!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

YOU MAY ALSO LIKE