- by Rrrr
టాక్సిక్ సినిమాపై రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు!!
టాక్సిక్ సినిమాలో అశ్లీలత ఎక్కువగా ఉందంటూ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ విమర్శించారు. స్నేహితులతో కలిసి సినిమా చూసేందుకు వెళ్లిన తాను.. కొన్ని సన్నివేశాలు నచ్చక మధ్యలోనే బయటకు వచ్చానని తెలిపారు. డ్రగ్స్, హత్యలు, మహిళలపై అసభ్యకర ప్రదర్శన తప్ప సినిమాలో మంచి సందేశం కనిపించలేదన్నారు.
సినిమాలు సమాజానికి మంచి సందేశం ఇచ్చేలా ఉండాలని రాజాసింగ్ సూచించారు. ‘ఛావా’, ‘ఇరుముడి’ వంటి సినిమాల్లో ధార్మిక, సామాజిక విలువలకు ప్రాధాన్యం ఉందని పేర్కొన్నారు. టాక్సిక్ హీరో యష్ కథల ఎంపికలో జాగ్రత్తగా ఉండాలని, అభిమానులపై సినిమాల ప్రభావాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలని సూచించారు.
0 Comments:
No comments yet. Be the first to comment!
Leave a Reply