ఎమ్మెల్యే హామీతో బీజేపీ ధర్నా వాయిదా...

రంగారెడ్డి జిల్లా | కల్వకుర్తి నియోజకవర్గం!

ఆమనగల్లు మున్సిపాలిటీ పరిధిలోని గాంధీ చౌరస్తా వద్ద అక్టోబర్ 5న నిర్వహించ తలపెట్టిన బీజేపీ ధర్నాను వాయిదా వేస్తున్నట్లు మున్సిపాలిటీ బీజేపీ అధ్యక్షులు శ్రీ కర్నాటి విక్రమ్ రెడ్డి తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే శ్రీ కసిరెడ్డి నారాయణరెడ్డి స్పందించి, చిరు వ్యాపారుల సమస్యల పరిష్కారానికి హామీ ఇవ్వడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు.


ఈ నెల 3వ తేదీన ఆమనగల్లు మున్సిపల్ కేంద్రంలో స్థానిక ఎమ్మెల్యే శ్రీ కసిరెడ్డి నారాయణరెడ్డితో కలిసి బీజేపీ నాయకులు, జాతీయ బీసీ కమిషన్ మాజీ సభ్యులు శ్రీ తల్లోజు ఆచారి పర్యటించారు. ఈ సందర్భంగా పట్టణంలో జరుగుతున్న అభివృద్ధి పనుల వల్ల చిరు వ్యాపారుల జీవనోపాధికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని తల్లోజు ఆచారి ఎమ్మెల్యేను కోరారు.


దీనిపై ఎమ్మెల్యే శ్రీ కసిరెడ్డి నారాయణరెడ్డి స్పందిస్తూ, పట్టణ అభివృద్ధి పనులకు చిరు వ్యాపారులు అడ్డంకి కాదని, వారి జీవనోపాధికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తామని తెలిపారు. చిరు వ్యాపారులు ఎదుర్కొంటున్న సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు.


ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించి హామీ ఇవ్వడంతో అక్టోబర్ 5న గాంధీ చౌరస్తా వద్ద నిర్వహించ తలపెట్టిన బీజేపీ ధర్నాను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు మున్సిపాలిటీ బీజేపీ అధ్యక్షులు శ్రీ కర్నాటి విక్రమ్ రెడ్డి స్పష్టం చేశారు.


ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి గోరటి నరసింహ, మున్సిపాలిటీ జనరల్ సెక్రెటరీ, మాజీ కౌన్సిలర్ దుడ్డు కృష్ణ యాదవ్, మాజీ వైస్ చైర్మన్ దుర్గయ్య, మున్సిపాలిటీ కౌన్సిలర్స్ సునీత ప్రశాంత్ నాయక్, కో ఆప్షన్ సభ్యులు చుక్క అలాజీ గౌడ్, మాజీ కౌన్సిలర్స్ చెన్న కేశవులు, కృష్ణ నాయక్, నాగర్ కర్నూల్ పార్లమెంట్ కో కన్వీనర్ నేనావత్ రవి రాథోడ్, కల్వకుర్తి అసెంబ్లీ సోషల్ మీడియా మాజీ కన్వీనర్ పద్మ ప్రశాంత్, గిరిజన మోర్చ సోషల్ మీడియా కన్వీనర్ నందు రాథోడ్, సీనియర్ నాయకుడు నరేందర్ బీజేపీ శ్రేణులు తదితరులు పాల్గొనడం జరిగింది.

author

Ganesh Adla

Author of this article

0 Comments:

No comments yet. Be the first to comment!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

YOU MAY ALSO LIKE