- by John Doe
జనసేనలో కమిటీల పునర్వ్యవస్థీకరణకు పవన్ కల్యాణ్ కసరత్తు!
-
- by Srinivas reddy Kalagiri
- in Politics
- 0 likes
స్థానిక సంస్థల ఎన్నికల సమన్వయ కమిటీతో సమావేశం.. క్షేత్రస్థాయి బలాబలాలపై సమీక్ష
పాత కమిటీలన్నీ రద్దు.. త్వరలో కొత్త కమిటీల ప్రకటన
స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నద్ధమవుతున్న జనసేన పార్టీ సంస్థాగత ప్రక్షాళనపై దృష్టి సారించింది. ఈ క్రమంలో పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ స్థానిక సంస్థల ఎన్నికల సమన్వయ కమిటీతో సమావేశమయ్యారు. ఎన్నికల్లో పార్టీ బలాబలాలు, క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితులు, అనుసరించాల్సిన వ్యూహాలపై సమీక్షించారు.
ఇప్పటికే ఉన్న కమిటీలన్నింటినీ రద్దు చేసినట్లు పవన్ కల్యాణ్ ప్రకటించారు. వాటి స్థానంలో త్వరలోనే కొత్త కమిటీలను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. క్షేత్రస్థాయిలో పార్టీకి ఉన్న వాస్తవ బలాన్ని, నాయకులు, కార్యకర్తల పనితీరును పూర్తిస్థాయిలో అంచనా వేసిన తర్వాతే తుది నిర్ణయాలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో సమర్థవంతంగా పనిచేసేలా కొత్త కమిటీలను రూపొందించడంతోపాటు, క్షేత్రస్థాయి పరిస్థితులకు అనుగుణంగా బాధ్యతలు అప్పగించేందుకు జనసేన నాయకత్వం కసరత్తు చేస్తున్నట్లు సమావేశం ద్వారా స్పష్టమవుతోంది.
0 Comments:
No comments yet. Be the first to comment!
Leave a Reply