- by John Doe
ప్రభుత్వ ఆస్పత్రుల నిర్మాణాల్లో వేగం పెంచాలి.!
-
- by Srinivas reddy Kalagiri
- in Health
- 0 likes
హైదరాబాద్: రాష్ట్రంలో ప్రభుత్వ ఆస్పత్రుల నిర్మాణ పనులను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ఎల్బీనగర్, అల్వాల్, వరంగల్, ఉస్మానియా ఆస్పత్రుల నిర్మాణాల పురోగతిపై సమీక్ష నిర్వహించిన సీఎం.. నిర్ణీత లక్ష్యాలకు అనుగుణంగా పనులు ముందుకు సాగాలని స్పష్టం చేశారు. నిర్మాణాల్లో జాప్యం లేకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు.
కొత్తగా నిర్మిస్తున్న ఆస్పత్రుల్లో వైద్య సేవలు అందుబాటులోకి వచ్చే సమయానికి అవసరమైన వైద్యులు, వైద్య సిబ్బంది నియామక ప్రక్రియను ఇప్పటి నుంచే ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. మౌలిక సదుపాయాల కల్పనతోపాటు మానవ వనరుల సమీకరణపైనా ప్రత్యేక దృష్టి పెట్టాలని పేర్కొన్నారు.
అధికారులు కేవలం కార్యాలయాలకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో పర్యటించాలని సీఎం స్పష్టం చేశారు. ప్రభుత్వ పాఠశాలలు, సాంఘిక సంక్షేమ వసతి గృహాలు, ప్రభుత్వ ఆస్పత్రులను స్వయంగా సందర్శించి అక్కడి పరిస్థితులను పరిశీలించాలని సూచించారు. విద్యార్థులు, రోగులకు అందుతున్న సేవలు, సదుపాయాలపై వాస్తవ పరిస్థితులను తెలుసుకుని సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
0 Comments:
No comments yet. Be the first to comment!
Leave a Reply