తిరుమలలో భక్తుల రద్దీ.. సర్వదర్శనానికి 30 గంటలు!

తిరుమల: తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తుల రద్దీ కొనసాగుతోంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని అన్ని కంపార్ట్‌మెంట్లు భక్తులతో నిండిపోవడంతో వెలుపల ఏర్పాటు చేసిన క్యూలైన్లలోనూ భక్తులు వేచి ఉన్నారు. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనం కల్పించేందుకు సుమారు 30 గంటల సమయం పడుతున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం వర్గాలు వెల్లడించాయి.


మరోవైపు శుక్రవారం ఒక్కరోజే 78,445 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. స్వామివారికి మొక్కులు చెల్లించుకుంటూ 40,098 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. భక్తులు సమర్పించిన కానుకల ద్వారా హుండీకి రూ.4.3 కోట్ల ఆదాయం సమకూరింది.


భక్తుల రద్దీ దృష్ట్యా క్యూలైన్లలో వేచి ఉన్నవారికి అవసరమైన సౌకర్యాలు కల్పించేందుకు టీటీడీ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. దర్శనానికి వచ్చే భక్తులు రద్దీని దృష్టిలో ఉంచుకుని తమ ప్రయాణాన్ని, దర్శన ప్రణాళికను ముందుగానే సిద్ధం చేసుకోవాలని సూచిస్తున్నారు.

author

Srinivas reddy Kalagiri

Author of this article

0 Comments:

No comments yet. Be the first to comment!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

YOU MAY ALSO LIKE