- by John Doe
పాకిస్తాన్‌పై భారత్ ఘన విజయం.. ఆసియా క్రీడల్లో మరో స్వర్ణం!
-
- by Srinivas reddy Kalagiri
- in Sports
- 0 likes
టీ20 క్రికెట్ ఫైనల్‌లో 19 పరుగుల తేడాతో గెలుపు
భారత్ 211/6.. పాకిస్తాన్ 192/6
ఆసియా క్రీడలు 2026లో భారత స్వర్ణ పతకాల వేట కొనసాగుతోంది. పురుషుల టీ20 క్రికెట్ ఫైనల్‌లో పాకిస్తాన్‌పై టీమిండియా ఘన విజయం సాధించింది. ఉత్కంఠభరితంగా సాగిన తుదిపోరులో 19 పరుగుల తేడాతో దాయాది జట్టును ఓడించి స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకుంది.
మొదట బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 211 పరుగుల భారీ స్కోరు సాధించింది. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్ జట్టు 6 వికెట్ల నష్టానికి 192 పరుగులకే పరిమితమైంది. దీంతో భారత్ 19 పరుగుల ఆధిక్యంతో విజయాన్ని అందుకుంది. ఈ గెలుపుతో ఆసియా క్రీడలు 2026లో భారత్ ఖాతాలో మరో బంగారు పతకం చేరింది.
0 Comments:
No comments yet. Be the first to comment!
Leave a Reply